- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని పైసల్ ఎక్కడివి KCR...?
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కు ప్రతిపక్షాలకు ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చందని మాజీ మంత్రి పొన్నాల ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ఎన్నికల ఖర్చు భరిస్తానని చెప్పినట్లు ఒక ప్రముఖ జర్నలిస్ట్ చెప్పారని, ఆ స్థాయిలో డబ్బులు ఎలా వచ్చాయని పేర్కొన్నారు. కేసీఆర్ 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు అందరికీ తెలుసన్నారు.
2014కి ముందు కేసీఆర్ కు అసలు ఫామ్ హౌస్ లేదన్నారు. అప్పట్లో ఎకరానికి కోటి రూపాయలు ఎందుకు రాలేదు?.. ఇప్పుడు ఎట్లా ఎకరానికి కోటి రూపాయలు వస్తుంది? అని విమర్శించారు. ప్రతిపక్షాల కూటమికి కేసీఆర్ ను చైర్మన్ చేస్తే 2024 ఎన్నికలకి ఖర్చు చేసేటంత డబ్బులు ఎక్క డ నుంచి వచ్చాయనేది? జనాలకు అర్ధం అవుతుంది అని అన్నారు. దేశంలో కేసీఆర్ అంత అవినీతిపరుడు ఎవరు లేరని మోడీ, అమిత్ షా అన్నారని.. మరి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా సీబీఐ, ఈడీ సంస్థని ఏర్పాటు చేశాం.. ఈరోజు ఆ సంస్థలు మీ కన్నుసన్నలో పని చేస్తున్నాయి.. 2014 ఎన్నికల్లో నల్లధనం తీసుకొస్తాము అన్నారు.. ఇప్పటివరకు ఎంత నల్లదనం వచ్చింది వివరాలు ఇస్తారా..?, 2014లో స్విస్ బ్యాంక్ లో రూ. 14 వేల కోట్లు ఉంటే.. 2022 నాటికీ రూ. 34 వేల కోట్లు అంటూ ఆయన పేర్కొన్నారు.