- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్గత విభేదాలపై పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు ఓటర్లను కలిసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈనెల 8వ తేదీన మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీ-కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు్న్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో 80 శాతం హామీలు అమలు చేసిన ఘనత తమదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీయండని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇస్తోందని చెప్పారు.
తమలాగే గ్యారంటీ కార్డు ఇచ్చే ధైర్యం మిగిలిన పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు గ్యారంటీ కార్డు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణమన్నారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా విభేదాలున్నాయి. అయినా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాం. ఎప్పుడు, ఏం చేయాలో మాకు తెలుసు. చిన్న చిన్న అంశాలపై ప్రభావం చూపడానికి చేసే ప్రచార కార్యక్రమాలు మెండుగా ఉన్నాయి. అవన్నీ మాకు అర్థమవుతున్నాయి. మా పార్టీలో ఇద్దరు ముగ్గురు పాదయాత్ర చేస్తున్న విషయాన్ని ఇతర పార్టీలకెందుకు చెప్పాలి. అది మా పార్టీ ఇష్టం. ఏం చేస్తామో ఇతరులకు ఎందుకు? ఏదైనా ఉంటే ప్రజలకే చెబుతాం. ఎవరి దృష్టి వాళ్లది.’ అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.