- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల చివర్లో ఆ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా జాయినింగ్స్: పొంగులేటి
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల చివర్లో వరుస జాయినింగ్స్ఉంటాయన్నారు. సోమవారం మాజీ మంత్రి జూపల్లి, పొంగులేటిలు వేర్వేరుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. కాంగ్రెస్పార్టీలోకి వచ్చే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీదే అంటూ ఇద్దరు నేతలు భట్టిని కోరారు. కేసీఆర్‌ను ఢీ కొట్టడంపై ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఇరువురు నేతలు భట్టికి వివరించారు.
ప్రజల సమస్యలపై ఫోకస్ పెడుతూనే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భట్టి.. ఇద్దరి నేతలను కోరారు. కొల్లాపూర్సభ తర్వాత ఒక వైపు ప్రజా సమస్యలపై ఫైట్ చేస్తూనే, మరోవైపు రాష్ట్రమంతటా చేరికలపై ఫోకస్పెడతామని పొంగులేటి, జూపల్లి భట్టికి వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు మద్ధతు పెరిగిందని.. కేసీఆర్, మోడీలు ఇక ఇళ్లకే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, పేదల కష్టాలు తీరుతాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.