Ponguleti Srinivas Reddy: ఈడీ, ఐటీ రెయిడ్స్ పై తొలిసారి మాట్లాడిన పొంగులేటి

by Prasad Jukanti |
Ponguleti Srinivas Reddy: ఈడీ, ఐటీ రెయిడ్స్ పై  తొలిసారి మాట్లాడిన పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై, తన కుటుంబ సభ్యులపై ఇటీవల జరిగిన ఈడీ, ఐటీ దాడులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తొలిసారి స్పందించారు. బీఆర్ఎస్ (BRS) పార్టీకి బీజేపీ (BJP) మంచి దోస్త్ అని.. తన ఇంట్లో జరిగిన రెయిడ్స్ కు సంబంధించిన డేటాను బీజేపీని అడిగి బీఆర్ఎస్ రిలీజ్ చేసుకోవాలన్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ మాటలు వింటుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ గడిచిన పదేళ్లుగా ప్రజలతో ఉన్న సంబంధాలను కోల్పోయిందని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ (KTR) ప్రజల వద్దకు పోకుండా.. ఇప్పుడు అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పాదయాత్రనైనా కనీసం ప్రజల కోసం చేస్తే బాగుంటుందన్నారు. అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్నో, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడానికో చేస్తే అది కేటీఆర్ తెలివితక్కువ తనం అవుతుందన్నారు. బీఆర్ఎస్ గత పదేళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రాంతాలకు, మతాలకు, కులాలకు మధ్య అనేక చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకుందని దుయ్యబట్టారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చెప్పినట్లుగా ఈ దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణలో కులగణన చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా కులగణన పూర్తి చేస్తామన్నారు. ఈ సంక్రాంతి లోపే సర్పంచ్ ఎన్నికలతో (Sarpanch Elections) పాటు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే లబ్ధిదారులను ఎంపిక చేశారని కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed