చంద్రబాబుకు పొంగులేటి బిగ్ థ్యాంక్స్.. ఏ విషయంలో అంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-02 03:34:19.0  )
చంద్రబాబుకు పొంగులేటి బిగ్ థ్యాంక్స్.. ఏ విషయంలో అంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పొంగులేటి హాజరై మాట్లాడారు. రాజకీయ పార్టీలు తమ లబ్ధికి ప్రిఫరెన్స్ ఇస్తాయని.. తెలుగు దేశం పార్టీ చీఫ్ నారాచంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు. 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు పూర్తి మద్దతు తెలిపారు కాబట్టే తెలంగాణలో మార్పు సాధ్యమైందన్నారు.

119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ టీడీపీ వారు మాత్రం నిద్రపోకుండా పనిచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీపీ క్యాడర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు. టీడీపీ అధికారంలో లేదని బాధ పడొద్దని.. మీరు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోము.. భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి పనిచేద్దామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా పొంగులేటి వ్యాఖ్యలతో లోక్ సభ ఎన్నికల్లో సైతం టీడీపీ మద్ధతును కాంగ్రెస్ పరోక్షంగా కోరిందా అనే చర్చ సాగుతోంది.

Advertisement

Next Story