- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఏస్థానంలో ఏ పార్టీ గెలవబోతోంది?.. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో సంచలన విషయాలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఈసారి ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. దీంతో రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయఢంకా మోగించబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తర పోరు:
రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తరంగా ఉండబోతున్నదని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ నాలుగు స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నట్లు అంచనా వేసింది. మూడు స్థానాల్లో బీజేపీ ఎడ్జ్ (2-5% మార్జిన్)తో ముందంజలో ఉండగా మరో 3 స్థానాల్లో ఎడ్జ్ (2-5% మార్జిన్)తో ముందంజలో ఉన్నట్లు అంచనా వేసింది. మరో రెండు స్థానాల్లో పార్టీల మధ్యే టఫ్ ఫైట్ ఉండబోతున్నదని లెక్కకట్టింది.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే:
ఆదిలాబాద్: బీజేపీ ఎడ్జ్
భువనగిరి: కాంగ్రెస్ ఎడ్జ్
చేవెళ్ల: బీజేపీ
హైదరాబాద్:ఎంఐఎం
కరీంనగర్: బీజేపీ
ఖమ్మం:కాంగ్రెస్
మహబూబాబాద్: కాంగ్రెస్
మహబూబ్ నగర్: టఫ్ ఫైట్
మల్కాజిగిరి: బీజేపీ
మెదక్: టఫ్ ఫైట్
నాగర్ కర్నూల్: కాంగ్రెస్ ఎడ్జ్
నల్గొండ: కాంగ్రెస్
నిజామాబాద్: బీజేపీ
పెద్దపల్లి:కాంగ్రెస్
సికింద్రాబాద్:బీజేపీ ఎడ్జ్
వరంగల్:కాంగ్రెస్ ఎడ్జ్
జహీరాబాద్: బీజేపీ ఎడ్జ్