- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కూన శ్రీశైలం గౌడ్‌ను అడ్డుకున్న పోలీసులు.. కుత్బుల్లాపూర్‌లో ఉద్రిక్తత
by GSrikanth |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కుత్బుల్లాపూర్‌లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. దేవేందర్ నగర్‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులకు కేటాయించటం లేదని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లబ్దిదారులతో కలిసి దీక్ష జరపాలని నిర్ణయించారు. దాంతో శుక్రవారం ఉదయమే పదుల సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కూన శ్రీశైలం గౌడ్‌ను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇక, దేవేందర్ నగర్‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
Next Story