మందుబాబులకు BIG షాక్.. పండుగపూట నో లిక్కర్

by Gantepaka Srikanth |   ( Updated:12 March 2025 4:56 PM  )
మందుబాబులకు BIG షాక్.. పండుగపూట నో లిక్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు(Liquor Lovers) పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా హోలీ పండుగ(Holi Festival) రోజున మద్యం షాపులు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి.. అదే రోజు సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఆ రోజున ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించినా, అల్లర్లకు కారణమైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ(Police Department) హెచ్చరించింది.

ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు సైతం చేశారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. సమాజంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. హోలీ(Holi) వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు. బహింగంగా ప్రదేశాల్లో వాహనదారులపై, సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లుతూ ఇబ్బందులకు గురిచేయొద్దని హెచ్చరించారు.

Next Story

Most Viewed