దిశ ఎఫెక్ట్.. యూట్యూబర్లకు పోలీసుల మాస్ వార్నింగ్

by M.Rajitha |
దిశ ఎఫెక్ట్.. యూట్యూబర్లకు పోలీసుల మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో అతి చేసే యూట్యూబర్లను తీవ్రంగా హెచ్చరించింది తెలంగాణ పోలీస్ శాఖ. వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. కొంతమంది యూట్యూబర్లు వారి ఛానెల్ వ్యూస్ కోసం రోడ్లపై ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని ఇకపై అలాంటివి చేస్తే ఊరుకునేది లేదని, ఎంతటి వాళ్ళైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా గురువారం ఓ యూట్యూబర్ కూకట్ పల్లిలో రోడ్ పై నోట్లు విసురుతూ రీల్స్ చేయడం దిశ న్యూస్ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి , కేసు నమోదు చేశారు. అంతకుముందు రోజు బుర్ఖా వేసుకున్న వ్యక్తి నడిరోడ్డు మీద బైక్ పై స్టంట్స్ చేయగా.. పోలీసులు అతన్ని, అతనికి సహకరిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతుండటం.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం.. పోలీసులు కేసు నమోదు చేయడం వంటివి ఎక్కడో ఓ చోట ప్రతినిత్యం జరుగుతూ ఉండటం.. పోలీస్ శాఖ వారికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇకపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే, స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తే, పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సో.. ఇకనైనా యూట్యూబర్లు జాగ్రత్తగా వీడియోలు తీయాలని ఆశిద్దాం.

Next Story

Most Viewed