Kaushik Reddy: ‘అరెస్టు చేస్తే చచ్చిపోతా’.. కౌశిక్ రెడ్డిపై మరో కేసు

by Prasad Jukanti |
Kaushik Reddy: ‘అరెస్టు చేస్తే చచ్చిపోతా’.. కౌశిక్ రెడ్డిపై మరో కేసు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. గచ్చిబౌలి పీఎస్ (Gachibowli PS) లో కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీసులను బెదిరించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం అరెస్టు కోసం పోలీసులు వెళ్లినప్పుడు.. తనను అరెస్టు చేస్తే చనిపోతానంటూ కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని తాజాగా ఈ కేసు నమోదు చేశారు. గత బుధవారం బంజారాహిల్స్ పీఎస్ (Banjara Hills P.S) కు తన అనుచరులతో కలిసి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. అక్కడ హల్ చల్ చేశారు. తన ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని విధుల నిమిత్తం బయటకు వెళ్తున్న సీఐ రాఘవేంద్రను అరడ్డుకుని కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించారని రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గురువారం కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో తనను అరెస్టు చేస్తే చనిపోతానని బెదిరించినట్లు పోలీసులు గచ్చిబౌలి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది.

Next Story