బండి సంజయ్‌కు అనూహ్య షాకిచ్చిన పోలీసులు!

by Satheesh |   ( Updated:2022-11-27 14:45:49.0  )
బండి సంజయ్‌కు అనూహ్య షాకిచ్చిన పోలీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుండి (నవంబర్ 28) ప్రారంభం కానున్న టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు షాకిచ్చారు. బైంసాలోని సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల కారణంగా పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు చివరి నిమిషంలో అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. రేపు బైంసాలో నిర్వహించే భారీ బహిరంగ సభ అనంతరం పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు అనుమతి కోసం ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. చివర్లో బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed