గవర్నర్ తమిళిసై పై పోచారం ఫైర్

by Sathputhe Rajesh |
గవర్నర్ తమిళిసై పై పోచారం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రిపబ్లిక్ డే రోజు గవర్నర్‌తో బీఆర్ఎస్ నేతల వివాదం ముదురుతోంది. ఒక్కొక్కరుగా గవర్నర్ రిపబ్లిక్ డే ప్రసంగంపై ఫైర్ అవుతున్నారు. తాజాగా గవర్నర్ తమిళిసై పై స్పీకర్ పోచారం మండి పడ్డారు. గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ. కొత్త భవనాలు నిర్మించడం, ఫామ్ హౌజ్ లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించిన విషయం తెలిసిందే.

ఇదే అంశంపై స్పందించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మైకులు అందగానే ఆరోపణలు చేయొద్దని కామెంట్ చేశారు. కొందరి కళ్లల్లో సంతోషం కోసం పరిపాలన రాజ్యాంగ విరుద్ధమన్నారు. కళ్లుండి అభివృద్ధిని చూడలేని వారు.. చెవులు ఉండి వినలేని వాళ్లు ఉండటం విచారకరమని గుత్తా వ్యాఖ్యనించారు.

Advertisement

Next Story