- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాన్సువాడ సభలో డ్యాన్స్ చేసిన పోచారం (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇక, సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పోచారంనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పోచారం లక్ష్మీ పుత్రుడని.. బాన్సువాడ బంగారు వాడలా మారిందని సీఎం అన్నారు. ఇక ఈ సభా వేదికపై రామక్క పాటకు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్టెప్పులు వేసి అలరించారు. అది చూసిన సభకు వచ్చిన ప్రజలు కేకలు వేశారు. పక్కనే ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ పోచారం స్టెప్పులకు నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story