- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ CM రేవంత్‌కు ప్రధాని మోడీ ఫోన్

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫోన్ చేశారు. నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాలా సాయం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి సీఎం వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామనీ తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోడీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చి ఇచ్చారు.
దోమలపెంట సమీపంలోని SLBC టన్నెల్‌లో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద... సొరంగంలో మూడు మీటర్ల మేర సైడ్ వాల్ కూలింది. దీంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉదయం షిఫ్ట్ లో సొరంగంలో పనులకు 50 మంది లోపలికి వెళ్లారు. ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి కార్మికులు బయటకు వచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో... వారిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు చేపట్టారు.
మరోవైపు.. ప్రమాద స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతీ క్షణం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని ప్రాణాలతో కాపాడేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా విపత్తు నిర్వహణ అధికారులతో పాటు ఆర్మీ అధికారుల సాయం కూడా కోరారు.