- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా బాబు ప్రాణాలు కాపాడండి ప్లీజ్..
దిశ, ఉప్పునుంతల: మూడు నెలల వయసులో అమ్మ పక్కన వెచ్చని పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన ఓ చిన్నారికి పెద్ద కష్టమొచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధి రాయిచెడు గ్రామానికి చెందిన ఎత్తపు శ్రీనివాస్, స్రవంతి దంపతుల ఒక్కగానొక్క కొడుకు ఎత్తపు హాసన్ (3నెలలు)కు చిన్న పేగుకు చిల్లులు పడింది. ప్రస్తుతం హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ బంజారాహిల్స్లో చికిత్స పొందుతున్నాడు. బాబు ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు అవసరమని డాక్టర్లు సూచించారు.
ఆపరేషన్ చేయకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే బాబు చికిత్స కోసం దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఖర్చుచేశామని, నిరుపేదలమైనా మేము అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేమని, దయచేసి దాతలు తమ వంతు సహాయం అందించి తమ బాబు ప్రాణాలను కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయాలనుకునే దాతలు బాబు తండ్రి ఎత్తపు శ్రీనివాసులు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా 9014349484,7780181186 లకు డబ్బులు పంపించాలని కోరుతున్నారు.