రైతువేదికల్లో దశాబ్ది సంబురాలు.. ముస్తాబు చేయాల్సిందిగా మంత్రి ఆదేశం

by samatah |
రైతువేదికల్లో దశాబ్ది సంబురాలు.. ముస్తాబు చేయాల్సిందిగా మంత్రి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీపబ్లిసిటీకి ప్లాన్ చేసింది . ఇందులో భాగంగా వ్యవసాయ శాఖా ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను రైతు వేదికల ద్వారా వ్యవసాయ విజయాలను తెలియపరుస్తూ పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పలు సూచనలు చేసారు . ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ .. జూన్ 3వ తేదీన రైతువేదికలను సుందరంగా ముస్తాబుచేయాలి రాష్ట్రంలో వ్యవసాయ శాఖా సాధించిన విజయాలను తెలియపరుస్తూ పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలను రైతు వేదికలు , సింగిల్ విండో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలని కోరారు . రైతువేదికలలో పండుగ వాతావరణం కనిపించే విదంగా అలంకరించాలని చెప్పారు. వ్యవసాయ మార్కెట్లను మామిడి తోరణాలతో , లైట్లతో అలంకరించి రైతులతో సమావేశాలు నిర్వహించాలని వ్యవసాయరంగానికి జరిగిన మేలును రైతులకు అవి అర్ధమయ్యేలా సమావేశాలలో , ప్రసంగాలలో వివరించి, కరపత్రాలు అందజేయాలని కోరారు . వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేసారు .

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికే ప్రాధాన్యమిస్తుందని , దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం గర్వకారణమన్నారు . వ్యవసాయానికి, రైతాంగానికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు . వ్యవసాయ శాఖ తరపున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోయేలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed