ప్రధాని మోడీ పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఫొటో!

by Disha Web Desk 5 |
ప్రధాని మోడీ పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఫొటో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎస్ ఎటాక్ చేస్తున్న తరుణంలో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ డీసీఎం కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి పక్కన మోడీ ఫోటో ఉంది. ఆ ఫ్లెక్సీలో అయోధ్య రామమందిరంతో పాటు మోడీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న ఫోటోలు వేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. తీన్మార్ మల్లన్న టీం అభిమానులు, గజ్వేల్ నియోజకవర్గం అని రాసుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. చివరకు మీరు మీరు ఒకటి అయిపోయారా అని, ఇది నిజంగానే జరగబోతోందా అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed