Phone Tapping Case: నేను ఇండియాకు రావట్లేదు.. తూచ్! యూఎస్‌లోనే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్‌రావు

by Shiva |
Phone Tapping Case: నేను ఇండియాకు రావట్లేదు.. తూచ్! యూఎస్‌లోనే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్‌రావు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్ రావు ఇవాళ యూఎస్ నుంచి వస్తారని, కేసులో అప్రూవర్‌గా మారుతారంటూ వార్తలు వెలువడ్డాయి. అవన్ని ఒట్టి పుకార్లేనని సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్‌ రావు అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స తీసకుంటున్నారు. అయితే, ట్రీట్‌మెంట్ ఇంకా మరో మూడు నెలల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇన్వె‌స్టిగేషన్‌లో భాగంగా ప్రభాకర్ రావు నివాసంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయనను అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫొన్లు ట్యాపింగ్ చేసి ప్రైవేటు వ్యక్తులతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్‌రావు బెదిరింపులు, దారుణాలకు ఒడిగట్టినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒకవేళ అదుపులోకి తీసుకుని విచారిస్తే.. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతల్లో ఎవరి పేర్లను బయటపెడతారా.. అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed