- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని A2 నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు (SIB Former DSP Praneet Rao) నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్టకేలకు ఆయనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్న దుగ్యాల ప్రణీత్‌రావు (Praneet Rao) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 11న ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు (Uma Maheshwar Rao) 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూర్తి చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి (Samba Siva Reddy) గైర్హాజరు కావడంతో పీపీ వాదనల కోసం విచారణను నేటికి వాయిదా వేస్తూ జడ్జీ రమాకాంత్ (Judge Ramakanth) ఉత్తర్వులు జారీ చేశారు.
గత విచారణ సందర్భంగా కేసులో ప్రణీత్‌రావు (Praneet Rao) ఒక్కరే జైలులో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర రావు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఇదే కేసులో ఉన్న మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావు (Former Additional SP Bhujanga Rao) మాజీ డీసీపీ ప్రభాకర్ రావు (Former DCP Prabhakar Rao) ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ హైకోర్టు జనవరి 31న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని మేజిస్ట్రేట్‌కు విన్నవించారు. మరోవైపు అదనపు ఎస్పీ తిరుపతన్న (Additional SP Tirupathanna)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. కేసులో పూర్తి వాదనలు విన్న జడ్జీ రమాకాంత్ (Judge Ramakanth), ప్రణీత్ రావుకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు.