‘బండి’కి బెయిలివ్వాల‌ని హ‌న్మకొండ కోర్టులో పిటిష‌న్‌

by Sathputhe Rajesh |
‘బండి’కి బెయిలివ్వాల‌ని హ‌న్మకొండ కోర్టులో పిటిష‌న్‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ బీజేపీ లీగ‌ల్ టీం హన్మకొండ జిల్లా కోర్టులో గురువారం మ‌ధ్యాహ్నం పిటిష‌న్ దాఖ‌లు చేసింది. టెన్త్ క్లాస్ ప‌రీక్ష ప్రశ్నాపత్రం మాల్‌ప్రాక్టీస్‌లో లోతైన విచార‌ణ జ‌రిపేందుకు అనుగుణంగా బండి సంజ‌య్‌ను పోలీస్ క‌స్టడీకి ఇవ్వాల‌ని కోరుతూ వ‌రంగ‌ల్ పోలీసులు ప్రభుత్వ న్యాయ‌వాది ద్వారా కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌ల చేశారు. బండికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల‌ను తారుమారు చేయ‌డంతో పాటు సాక్ష్యుల‌పై ప్రభావం చూపుతాడ‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నట్లు స‌మాచారం. అయితే లంచ్ త‌ర్వాత ఇరు ప‌క్షాల వాద‌న‌లు జ‌డ్జి ముందు వినిపించ‌నున్నారు. బండికి బెయిల్ మంజూరవుతుందా..? లేక పోలీస్ కస్టడీకి అనుమ‌తిస్తారా..? అన్న దానిపై మ‌రి కొద్దిసేప‌ట్లో స్పష్టత రానుంది.

Advertisement

Next Story