HYDRA: హైడ్రా రద్దుపై పిటిషన్.. నేడు హైకోర్టులో విచారణ

by Y.Nagarani |
HYDRA: హైడ్రా రద్దుపై పిటిషన్.. నేడు హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా టీమ్ కూల్చివేస్తోంది. అయితే దీనిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా అంతా పక్షపాతంగా ఉందని, కొందరు వ్యక్తులే టార్గెట్ గా కూల్చివేతలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

హైడ్రా జీఓ నంబర్ 99ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జీఓను కొట్టివేయాలని రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు అవ్వగా.. వాటిపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరుపనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, అందులో జీఓ 99ని రద్దు చేయాలని పిటిషనర్లు అందులో కోరారు.

కాగా.. నిన్న జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏ కట్టడాన్ని కూల్చివేసినా రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాల్సిందేనని మొట్టికాయలు వేసింది. అమీన్ పూర్ కూల్చివేతల కేసు విచారణలో భాగంగా.. ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Next Story

Most Viewed