- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ ఊసరవెళ్లి రాజకీయాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు’
దిశ, తెలంగాణ బ్యూరో : ఉప ఎన్నికలకు ముందు ఒకచోట దళితబంధు అని, మరోచోట గిరిగిజనబంధు అని ప్రకటించి.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ ఊసరవెళ్లి రాజకీయాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసులు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడా? అని ప్రశ్నించారు. మాటమీద నిలబడే వ్యక్తి కేసీఆర్ అని పేర్కొంటున్న మంత్రి దయాకర్ రావు.. ఏ హామీని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏమైంది? విద్యార్థులకు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైంది?మెస్ చార్జీల పెంపు ఎందుకు చేయలేదు, ఏళ్లతరబడి రేషన్ కార్డులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. 111 జీవో ఎవరికోసం రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుమారుడికోసమా? హరీష్ రావు కోసమా? కుమార్తె కవిత కోసమా? అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తామన్న సీఎం హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేళంలోని ఇతర రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ను అధ్యక్షుడిని చేస్తే రాబోయే ఎన్నికల ఖర్చంతా భరిస్తానని వచ్చిన వార్తలకు ఏం సమాధానం చెబుతారని, ఇంత డబ్బు ఎక్కడిదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీలపై చర్చకు సిద్ధమా అని ఎర్రబెల్లికి సవాల్ చేశారు.