రెండు లారీల పీడీఎస్ బియ్యం దారి మళ్లింపు.. అవినీతి అధికారులపై వేటు

by Rajesh |
రెండు లారీల పీడీఎస్ బియ్యం దారి మళ్లింపు.. అవినీతి అధికారులపై వేటు
X

దిశ, సుల్తానాబాద్: పీడీఎస్ బియ్యం దారిమళ్లించిన అవినీతి అధికారులపై వేటు పడింది. సుల్తానాబాద్ మండలంలోని స్టేజి వన్ గోదాము నుంచి, పౌరసరఫరాల శాఖ ఇక్కడి ఎం‌ఎల్‌ఎస్ పాయింట్‌కు సోమవారం ఐదు లారీల్లో బియ్యం లోడ్ పంపించింది. ఇందులో 420 బస్తాలు చొప్పున మూడు లారీలు మాత్రమే చేరాయి. వాటిని పలు రేషన్ షాపులకు సరఫరా చేశారు. అయితే 450 బస్తాలున్న ఓ లారీ, 495 బస్తాలున్న మరొక లారీని దారి మళ్లించారు. దారి మళ్లిన బియ్యం బస్తాల లారీని గుర్తించేందుకు విజిలెన్స్ అధికారి ఎస్పీ రామారావు ఆధ్వర్యంలో పట్టణంతో పాటు మండలంలోని పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు.

తాత్కాలిక ఉద్యోగి అయిన శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన జమ్మికుంట మండలం కల్లెపెల్లి వెళ్లి విచారించారు. లారీలతో పాటు డ్రైవర్లను తాత్కాలిక పద్ధతి‌పై నియమించుకొన్న డాటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరెడ్డిని విచారించారు. దీనిపై డీఎస్ఓ వెంకటేష్‌ను వివరణ కోరగా పూర్తిస్థాయి నివేదికను అదనపు కలెక్టర్‌కు అందించామని తెలిపారు. రెండు లారీలు బియ్యం దారి మళ్లిన విషయమై డాటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరెడ్డి, అవుట్ సోర్సింగ్ ఏజెంట్, లారీల రవాణా చేసే కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. గోదాం తాత్కాలిక ఇన్చార్జ్ వెంకట్ రాజమును కూడా సస్పెండ్ చేశామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed