- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓపెన్ కాస్ట్ మైన్ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి: మంత్రి శ్రీధర్ బాబు
దిశ, తెలంగాణ బ్యూరో: లద్నాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ కోసం సింగరేణి కాలరీస్ సేకరించిన భూమిలో ఇళ్లు నిర్మించుకున్న 280 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద పరిహారం చెల్లింపు విషయమై లబ్దిదారులతో చర్చలు జరపాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మైన్ కోసం సింగరేణి కాలరీస్ సేకరించిన భూమిలో ఇళ్లు నిర్మించుకున్న నిర్వాసితుల సమస్యలపై సింగరేణి ఎండీ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులుగా ఉన్నా 280 మందికి ఆర్ అండ్ ఆర్ చెల్లింపులో చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తేగా వారందరితో మాట్లాడి మానవతా దృక్పథంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అప్పట్లో 466 ఇళ్లకు నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ కింద 721 మందికి, ఒక్కక్కరికి రూ.7.5 లక్షల చొప్పున చెల్లించింది. నివాసాలు కోల్పోయినందుకు, మనుషుల పునరావాసానికి సింగరేణి మొత్తం రూ.145 కోట్లు విడుదల చేసింది.