- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
D. K. Aruna : పార్టీ మార్పు ప్రచారం.. డీకే అరుణ క్లారిటీ!
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: నేను పార్టీ మారుతున్నాను అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం 'దిశ ' తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులే నా ఓటమి కోసం ప్రత్యేకంగా పనిచేశారు. అందుకే ఆ పార్టీని వీడాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అధిష్టానం నాకు మంచి గుర్తింపుని ఇచ్చి హోదాను కల్పించింది అని అరుణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గద్వాలలో బలమైన బీసీ నేతలు ఉన్నప్పటికీని స్థానికేతరులకు పోటీ చేసే అవకాశం కల్పించింది.
పార్టీ నుండి స్థానికులైన బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళితే అందుకు అంగీకరించింది. ఈ కారణంగానే నేను గద్వాల నుండి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను తప్ప మరొకటి లేదు అని డీకే అరుణ స్పష్టం చేశారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే చేస్తాను అని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు మైండ్ గేమ్ ఆడుతూ నేను పార్టీ మారుతున్నాను అంటూ దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు అని ఆమె స్పష్టం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా అసత్య ప్రచారాలు చేయొద్దని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.
- Tags
- D. K. Aruna