- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మార్పు ప్రచారం.. అద్దంకి దయాకర్ క్లారిటీ!
దిశ, డైనమిక్ బ్యూరో: తాను కాంగ్రెస్ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వీడియోను రిలీజ్ చేసిన ఆయన నేను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నమ్మవద్దని కోరారు. బీఆర్ఎస్ పార్టీలో కొంత మంది చేస్తున్న కుట్రలో భాగంగానే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం నాకు ఎప్పుడు అండగా ఉందన్నారు.
తుంగతుర్తి విషయం, ఇతర విషయాల్లో పార్టీ ఎప్పుడు తనకు వ్యతిరేకంగా లేదన్నారు. నేను పార్టీలో కొనసాగుతున్నానని చెప్పడానికి ఈ వీడియోను చేయడం లేదని పార్టీని, అద్దంకి దయాకర్‌ను బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ఇంతకు దిగజారిందని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానన్నారు. పార్టీలో అందరిని కలుపుకుపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అందరూ సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తనకే బీ ఫామ్ రాబోతున్నదని తుంగతుర్తిలో నామినేషన్ కూడా వేయబోతున్నట్లు చెప్పారు.