- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేపర్ లీక్ ఇష్యూ: గవర్నర్ తమిళిసైకి షర్మిల బహిరంగ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ లీకేజీలో ఐటీ విభాగం పాత్రపై సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో ప్రోగ్రెస్‌పై నివేదిక కోరాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల గవర్నర్ తమిళి సైకి బహిరంగ లేఖ రాశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కుంభకోణం యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిందని, నెలలు, ఏండ్ల తరబడి కష్టపడి పరీక్షకు ప్రిపేరైన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. వారి భవిష్యత్ ప్రశ్న్రార్థకంగా మారిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ఐటీ శాఖ వైఫల్యమేనని ఆమె ఆరోపించారు.
ముఖ్యమంత్రి తనయుడి నిర్వహణలో పనిచేసే శాఖ కావడంతో నేరస్తులను పట్టుకుని శిక్షించే ఆలోచన ఎవరికీ లేదని, సిట్ కూడా ఆ శాఖ జోలికి వెళ్లడంలేదన్నారు. పెద్దతలలు బయటపడతాయనే భయంతో విచారణ చేయకపోతే అసలు కేసు క్లోజ్ కాదని ఆమె పేర్కొన్నారు. అందుకే రాజ్యాంగ అధికారాల ద్వారా ఐటీ విభాగం, అందులోని కొందరి పాత్రపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద విచారణ ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఎందుకంటే ఏ సర్కారు అయితే ఆరోపణలు ఎదుర్కుంటుందో, ఆ సర్కారే విచారణ చేపడుతోందని, దీని ద్వారా పెద్దతలకాయలు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు.