సీటీఎస్ సెంటర్ హెడ్‌గా పాండురంగారెడ్డి

by Shiva |
సీటీఎస్ సెంటర్ హెడ్‌గా పాండురంగారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ (సీటీఎస్) సెంటర్ హెడ్‌గా కెప్టెన్ డాక్టర్ పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో సోమవారం ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్‌ను కలిశారు. తెలంగాణ అధ్యయనం కేంద్రం సెంటర్ హెడ్‌గా నియామకమైన పాండురంగా‌రెడ్డి 1962 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో ఆయనను మొదట చనిపోయినట్లుగా ప్రకటించారు. కానీ, ఆయన చావు నుంచి తృటిలో బయటపడ్డారు. సివిల్ సర్వీస్ రాసే వారికి ఎంతోమందికి కోచ్‌గా ఆయన వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంపై పీహెచ్‌డీ చేసినా.. కాన్వకేషన్‌లో ఆయన పీహెచ్‌డీ పట్టాను తిరస్కరించారు. కానీ, ఆయన థీసిస్ ఎంతో మంది రాజకీయ నేతలకు రాష్ట్ర విభజన అంశాలపై చర్చించేందుకు ఉపయోగపడింది.

Advertisement

Next Story

Most Viewed