- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డబ్బులకు అమ్ముడుపోయిన బ్రోకర్ సంజయ్ కుమార్ : పాడి కౌషిక్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : డబ్బులకు అమ్ముడు పోయిన బ్రోకర్, దొంగ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్‌రెడ్డి, డాక్టర్‌కే. సంజయ్ మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మరో ఎంఎల్ఏ డాక్టర్‌కే. సంజయ్‌తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించారని అలాంటిది నన్ను డిస్ క్వాలిపై చేయాలని ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కే ఫిర్యాదు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఈ ఘటన జరిగిందని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పైన దాడి చేశాడని, అయితే తానే ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి చేసినట్లు కోన్ని మీడియా ఛానెల్స్ ప్రచారం చేసి, వార్తలు రాశారని ఇందులో వాస్తవం లేదన్నారు. తన హుజూరాబాద్నియోజకవర్గంలో రైతు రుణమాఫీ జరగలేదని సమీక్ష సమావేశంలో ప్రశ్నించానని , అలా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాపైన రన్నింగ్ కామెంట్స్ చేశారని అన్నారు.
కేసీఆర్ లేకపోతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వార్డ్ మెంబర్ గా కూడ గెలవలేడు అని, కేసీఆర్ దయతోనే సంజయ్ కూమార్ ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు. నన్ను డిస్ క్వాలిపై చేయడానికి నేనేమీ నామినేటెడ్ పోస్టులో లేను, శాసన సభ్యుడిగా ఉన్నానన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి డీకే అరుణ పైన సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని, అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టలేదన్నారు. మా పార్టీ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూమార్ ను దొంగ అంటే నాపైన కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన అమలు కోసం నేను ప్రశ్నిస్తుంటే నాపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 28 కేసులు పెట్టించారన్నారు.
చివరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన నేను కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ప్రశ్నిస్తుంటే నాపైన పీడీ యాక్ట్ పెట్టారని రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్ అని ఎద్దేవ చేశారు. క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డే నంబర్ 1 అని , బ్లాక్ మెయిలర్ , ఛీటర్ , బ్రోకర్ , ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి నే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్‌రెడ్డి విమర్శించారు. భువనగిరిలో మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసి, కేసీఆర్ ఫొటోను నేలకేసి కొట్టేందుకు ఎన్ని గుండెలు రా రేవంత్ రెడ్డి మీ పార్టీ వారికి ? అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనా? కేసీఆర్ ఫోటోను నేలకేసి కొడుతుంటే ప్రజల గుండెల్లో బుల్లెట్ గుచ్చుకున్నట్లు అవుతోంది అందుకే మా పైన దాడులు చేస్తే మేము ప్రతిదాడులు చేస్తాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్‌రెడ్డి అన్నారు.