Viral: అంత అస్సాం.. కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓటమి! సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ

by Ramesh N |   ( Updated:2025-02-09 11:29:42.0  )
Viral: అంత అస్సాం.. కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓటమి! సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)ను కలిసిన వారంతా ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం (Delhi Assembly Elections) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని అభినందిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు, నెటిజన్లు తీవ్ర స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు.

‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా, అంత అస్సాం.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. వారికి కేసీఆర్ గతంలో పుష్పగుచ్చం అందించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. మీ కుటుంబం వల్ల నేడు ఆప్ పార్టీ అతి దారుణంగా ఓడిపోవాల్సి వచ్చిందని (Congress) కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేశాయి.

ఇక, ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని, ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు ఇచ్చారని, మన తెలంగాణ మేస్త్రీ లెగ్గు మహిమ అంటూ (BRS) బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ట్వీట్స్ వేస్తున్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో దగ్గరుండి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని, ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని, కాంగ్రెస్ పార్టీకి ఐరన్ లెగ్ తరహాలో రేవంత్ రెడ్డి మారాడని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

Next Story

Most Viewed