ORR: ఓఆర్ఆర్ టోల్‌లీజ్‌లో అవకతవకలు.. కేసీఆర్, కేటీఆర్ పై ఈడీకి ఫిర్యాదు

by Ramesh Goud |
ORR: ఓఆర్ఆర్ టోల్‌లీజ్‌లో అవకతవకలు.. కేసీఆర్, కేటీఆర్ పై ఈడీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్(ORR Toll Lease) విషయంలో అవకతవకలు జరిగాయని, కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లపై బీసీ పొలిటికల్ జేఏసీ(BC Political JAC) ఆధ్వర్యంలో ఈడీ(ED)కి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం(BRS Government) ఓఆర్ఆర్ ను ఐఆర్‌బీ సంస్థ(IRB Industry)కు లీజుకు ఇచ్చినందుకు, ఐఆర్‌బీ సంస్థ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) రూపంలో ముడుపులు తీసుకున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్(Rachala Ugandar) మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ టోల్‌లీజ్ లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

ఏప్రిల్ 2023 లో ఐఆర్‌బీ (IRB) అనే సంస్థకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్(ORR) ను 30 ఏళ్లకు లీజుకు ఇచ్చిందని, దీనికి బదులుగా జూలై 2023 లో ఐఆర్‌బీ సంస్థ నుంచి రూ.25 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పాలనలో క్విడ్ ప్రోకోతో ఎన్ క్యాష్మెంట్ జరిగిందని అన్నారు. గతంలో ఆమ్ఆద్మీ పార్టీ ఇలాగే చేస్తే ఈడీ నోటీసులు ఇచ్చి, ఎంక్వైరీ చేసిందని, ఇప్పుడు కూడా ఓఆర్ఆర్ అవకతవకలపై ఎంక్వైరీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 30 ఏళ్ల ఓఆర్ఆర్ లీజుకు కేవలం 7 వేల కోట్లకు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బీఆర్ఎస్ పార్టీ చెప్పాలని నిలదీశారు. అంతేగాక ఈ కోట్ల రూపాయలు గోల్‌మాల్ వెనుక కేటీఆర్ హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈడీ తక్షణమే విచారణ జరిపి గత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లపై చర్యలు తీసుకోవాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు యుగంధర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed