- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హజ్ యాత్రికుల కోసం ఆన్ లైన్ ఈ-బుకింగ్
దిశ, తెలంగాణ బ్యూరో : హజ్ యాత్రికుల కోసం జూన్ 5 నుంచి హజ్ చార్టర్ విమానాలు నడుపుతారని.. యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. తెలంగాణ యాత్రికులు, హజ్ యాత్రికుల కోసం విస్తారా ఎయిర్లైన్స్ హజ్ హౌజ్ కు రిపోర్టు చేస్తారని చెప్పారు. ఆన్లైన్ ఈ-బుకింగ్ సిస్టమ్ మరియు మాన్యువల్ బుకింగ్ సిస్టమ్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ లోని హజ్ కమిటీ భవనంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు. హజ్ హౌస్ లో అవసరమైన సౌకర్యాలను పూర్తి చేసినట్టు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ హజ్ హౌస్ లో పాసులు, సామాను స్ర్కీనింగ్, సామాను చెక్ ఇన్, మెడికల్, టీకా వంటివి ఏర్పాటు చేశారని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. దాదాపు ఏడు వేల మంది హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ప్రభుత్వ సలహా దారు ఏకే.ఖాన్, రాష్ర్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిఉల్లాఖాన్, మైనార్టీ కార్పోరేషన్ ఉన్నతాధికారి షఫీ ఉల్లాఖాన్, ప్రభుత్వ సలహ కార్పోరేటర్ రేఖతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
చెస్ టోర్నమెంట్స్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూన్ 2 నుంచి 4 వరకు నిర్వహించనున్న 1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా 1600 లోపు ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ పోస్టర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. చెస్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న చెస్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూన్స్ సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ , ఇతర తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు అధికారులు పాల్గొన్నారు.