అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత.. వేల సంఖ్యలో రోడ్లపైకి అభ్యర్థులు

by Mahesh |
అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత.. వేల సంఖ్యలో రోడ్లపైకి అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 21న జరిగే గ్రూప్ -1 పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని, జీవో నెంబర్ 29 ని రద్దు చేసి.. తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి.. ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గ్రూప్-1 అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో శుక్రవారం రోడ్లపైకి వేలాది మంది రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసుల తీరును ఖండించారు. అలాగే శనివారం గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా నిలిచి.. అశోక్ నగర్ లో నిరసన వ్యక్తం చేశారు. కాగా శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగుతాయని, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని, 95 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం అయ్యారని అన్నారు. పటిష్ట బందోబస్తు నడుమ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి తీరుతాం అని తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరోసారి అశోక్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేలాది మంది అభ్యర్థులు ఒక్కొక్కరిగా రోడ్డుపైకి వచ్చి చేరారు. గ్రూప్-1 అభ్యర్థులకు తోడు విద్యార్థి సంఘాలు, ఇతర నిరుద్యోగులు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్-1 పరిక్షలను వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ముందస్తుగానే అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో.. ఏ క్షణం ఎమ్ జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థుల నిరసన కు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు కూడా ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed