- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆ ఒక్క పనిచేసి ఉంటే మనమే అధికారంలో ఉండేవాళ్లం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్ వేదికగా మహబూబ్‌నగర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఏది నోటికొస్తే అదే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచారని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను నమ్మి ఓట్లేసిన ప్రజలు.. ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. మరోవైపు మనం చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయామని అన్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో అందరం విఫలం అయ్యామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. పనులపై కాకుండా ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే మనమే అధికారంలోకి వచ్చే వాళ్లం అని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కేవలం 1.85 శాతమే అని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఎవరూ నిరుత్సాహ పడొద్దని ధైర్యం చెప్పారు. పోరాటం మనకు కొత్త కాదని గుర్తుచేశారు.