Hyderabad floods : అధికారుల కీలక నిర్ణయం.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్

by GSrikanth |   ( Updated:2023-07-28 05:47:17.0  )
Hyderabad floods : అధికారుల కీలక నిర్ణయం.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్
X

దిశ, సిటీ బ్యూరో: ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కు 2 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌కు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో తాజాగా మరో రెండు గేట్లను గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఎత్తనున్నారు.

మొత్తం నాలుగు గేట్ల ద్వారా 2750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. మరోవైపు ఉస్మాన్ సాగర్‌కు సైతం భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఈ రిజర్వాయర్ రెండు గేట్లను ఇప్పటికే ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా.. తాజాగా మరో రెండు గేట్లను నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఎత్తారు. రిజర్వాయర్‌కు 1600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. రెండు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 432 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీ నదిలో విడుదల చేయనున్నారు.

Read More : Breaking: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సాయంత్రం నుంచి భారీ వర్షాలు...!

Advertisement

Next Story

Most Viewed