బహిరంగ ప్రదేశాల్లో అభ్యంతరకర ప్రవర్తన.. పలువురు అరెస్ట్

by GSrikanth |
బహిరంగ ప్రదేశాల్లో అభ్యంతరకర ప్రవర్తన.. పలువురు అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బహిరంగ ప్రదేశాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన పలువురిని షీ టీమ్స్​సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి జరిమానాలు విధించటంతోపాటు కౌన్సెలింగ్​ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో కొన్ని జంటలు శృంగార కార్యకలాపాలు సాగిస్తూ ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తున్నట్టుగా ఇటీవల షీ టీమ్స్‌కు పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లోని పార్కులతోపాటు ఇతర ప్రదేశాల్లో మఫ్టీలో రంగంలోకి దిగిన షీ టీమ్స్​సిబ్బంది అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

దీనికి ముందు సాక్ష్యంగా వాళ్ల కార్యకలాపాలను వీడియో రికార్డింగ్​చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో 12మందికి సీపీ యాక్ట్​సెక్షన్​70(బీ) ప్రకారం 50 రూపాయల చొప్పున జరిమానా విధించారు. హద్దులు మీరి ప్రవర్తించిన మరో ఇద్దరికి సీపీ యాక్ట్​సెక్షన్​70(బీ), 188తోపాటు ఐపీసీ 290 ప్రకారం 1250 రూపాయల చొప్పున జరిమానా విధించారు.

Advertisement

Next Story

Most Viewed