- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మాజీ మంత్రుల దిష్టిబొమ్మలు దహనం

దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహా జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ధర్నాలో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేగాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం అని, దళిత ప్రజా ప్రతినిధుల పట్ల చులకన భావంతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను సమర్పిస్తున్న కేటిఆర్, హరీష్ రావు ఆంతర్యంలో దళితల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి కనీస ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన బీసీ కులగణన సర్వేలో కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు పాల్గొనలేదని విమర్శించారు. రాజ్యంగా బద్దమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
ప్రజా ప్రభుత్వ పాలనకు సలహాలు ఇవ్వాల్సింది పోయి సోషల్ మీడియా వేధికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కుటుంబాన్ని సైతం తమ రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మీడియా ముసుగులో డబ్బులకు అమ్ముడు పోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దొంగ యూట్యూబ్ ఛానల్ ల ద్వారా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యాకారులుగా చెప్పుకుని శవాల మీద పేలాల రాజకీయం చేస్తున్నారని అన్నారు. మీ పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారని, ఉద్యమకారులను, వరంగల్ జిల్లా అభివృద్ధిని విస్మరించిన మీరు అధికారం పోగానే లౌక్యం కోల్పోయి మాట్లాడుతున్నారని, మీ ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రజలు బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నేత హెచ్చరించారు.
Read More..