- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతకు రాజకీయ అవకాశాలు కల్పించింది ఎన్టీఆరే : కాసాని జ్ఞానేశ్వర్
దిశ, తెలంగాణ బ్యూరో : బడుగు బలహీన వర్గాలతో పాటు యువతకు రాజకీయ అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం టీడీపీ 41వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకు సాగిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మండల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పరిపాలనను అందించారని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు ఉండాలని స్థానిక రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. టీడీపీలో ఎంతోమంది కార్యకర్తలు నాయకులుగా ఎదిగారన్నారు. కేవలం 9 నెలలు అధికారంలో వచ్చిన ఘనత ఎన్టీఆర్ ఒక్కరికే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతామన్నారు. ప్రజలంతా టీడీపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్, జ్యోత్స్న, సుబ్బారావు రాజు నాయక్, మీడియా కోఆర్డినేటర్ బియ్యని సురేష్, కాసాని సాయి, రాజు, అమరేందర్, జయరాం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:ఇంటి దగ్గర నుంచే ఓటు ఎలా వెయ్యొచ్చంటే?