- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం ఆపండి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ప్రతిరూప ఆలయాల(Badrinath-Kedarnath Temple) నిర్మాణాలు ఆపేయాలంటూ ట్రస్ట్‌కు లీగల్ నోటీసులు వెళ్లాయి. ఈ నోటీసులు సోమవారం అందగా.. మంగళవారం వెలుగులోకి వచ్చాయి. బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయాల నమూనాల్ని పున:సృష్టించకూడదంటూ కేదార్‌నాథ్ ఆలయ పూజారులు నోటీసులు పంపారు. రెండు వారాల్లో నోటీసులకు స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందించకపోతే క్రిమినల్ చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా.. నోటీసులపై ఆలయాలను నిర్మిస్తున్న జైపాల్ సింగ్(Jaipal Singh) స్పందించారు.
మంగళవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. తాను శంకరుడి పరమ భక్తుడిని అని అన్నారు. ఆలయం నిర్మించుకుంటే తప్పేందని అసహనం వ్యక్తం చేశారు. కాగా, దక్షిణ బద్రీనాథ్‌గా పిలుస్తున్న ఆ ఆలయమే సిద్దిపేట(Siddipet)లోని ములుగు మండలం, బండమైలారంలో ఏర్పాటయ్యింది. ఉత్తరాఖండ్ వాసులే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. ఉత్తరాదిలోని బద్రీనాథ్ ఆలయం సుమారు ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కానీ... ఈ ఆలయం ఏడాది మొత్తం భక్తులకు అందుబాటులో ఉంటుంది. అక్కడ మిస్ అయిన వారు ఇక్కడ చూడొచ్చనే ఉద్దేశంతోనే నిర్మాణం చేపట్టామని వెల్లడించారు.