- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ బాధ కరెంట్ గురించి కాదు.. పొలిటికల్ పవర్ కట్ చేశారని:జగ్గారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో:అధికారం లేకపోవడంతో కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారని అందుకే 100 రోజుల కాంగ్రెస్ పాలనపై నిందలు వేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ బాధంతా ఎలక్ట్రిసిటీ పవర్ కట్ గురించి కాదని ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారని బాధతో ఉన్నారని విమర్శించారు. అందువల్లే విద్యుత్ కోతలపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. అధికారంలో ఉండగా ఎన్నడు ప్రజలు గుర్తుకు రాని కేసీఆర్ కు ఇవాళ ఎంపీ ఎన్నికల్లో గత్యంతరం లేక ప్రజల్లోకి వచ్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ బయటకు వస్తే ఎండల హీట్, రాకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో హీటు ఉందని అందువల్లే ఆయన ఆలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ కు తెలంగాణ ప్రజలపై నిజంగా ప్రేమ లేదని మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తి కేసీఆర్ అని ఆయన మంచి నటుడు డైలాగ్స్ చెప్పడంలో దిట్ట అని సెటైర్ వేసారు. 10 నిమిషాలు భోజనం చేసే సమయంలో కరెంట్ పోతే వంద రోజుల పరిపాలనపై నిందలు వేస్తున్నారన్నారు. పదేళ్లు సీఎంగా పని చేసి పదవి పోగానే కేసీఆర్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని సెటైర్ వేశారు. అధికారంలో ఉన్నప్పుడు ట్విట్టర్ ఆన్ చేసి ఉంటే పేదలు, సామాన్యులు వాళ్ల బాధలు మీ దృష్టికి తీసుకువచ్చేవారు కదా అన్నారు. ప్రతిపక్షంలోకి రాగానే ట్విట్టర్ ఓపెన్ చేయడం వెనుక మతలబు ఏంటి అని ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాన్నారు.
బీఆర్ఎస్ ను గెలిపిస్తే వెనుక డోర్ నుంచి బీజేపీ పంచన చేరుతారని అదే కాంగ్రెస్ ను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. అబద్ధాలు ఆడటంలో కేసీఆర్ నెంబర్ వన్ అయితే కేటీఆర్ నెంబర్ టు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలవడం ఎప్పుడైనా కలిసిందా? ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారిసి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఇండిపెండెంట్ కోసం పోరాటం చేసిందన్నారు. ఈ రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం ఇప్పటిది కాదన్నారు. సోనియా అంటే మోడీకి భయం పట్టుకుందని ధ్వజమెత్తార. మన్మోహన్ సింగ్ ప్రధానిగా దిగిపోయే నాటికి తులం బంగారం రూ.28 వేలు ఉంటే బీజేపీ పదేళ్ల పాలనలో రూ.70 వేలు దాటిందని విమర్శించారు.
Read More...
ఇంటి పేరు కల్వకుంట్ల తీసేసి.. అబద్ధాల అని పెట్టుకో.. కేసీఆర్‌పై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు