- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి మరణానికి కల్తీకల్లే కారణమైతే ఎవరినీ వదలం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కల్తీకల్లు కారణంగా ఇద్దరు మరణించారు.. మరి కొంతమంది వైద్య సేవలు పొందుతున్నారు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదే నిజం అయితే ఎవరినీ వదిలేది లేదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలు, ఆహార పదార్థాలు, కల్లు కల్తీ చేసి ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడే ఏ ఒక్కరిని వదలబోమని ఆయన స్పష్టం చేశారు. కల్తీకల్లు కారణంగా ఇద్దరు చనిపోయారు అని ప్రచారం చేస్తున్నారు.
పలు రకాల అనారోగ్య కారణాలవల్ల చనిపోయారు అంటూ మృతుల కుటుంబీకులే రాతపూర్వకంగా ఇచ్చారు. పోస్టుమార్టం నిర్వహించి శాంపింల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపడం జరిగిందని మంత్రి తెలిపారు. రిపోర్టులో కల్తీకల్లు వల్లే మరణించారని తేలితే బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నిజా నిజాలు తెలుసుకోకుండా రాద్ధాంతాలు చేయడం సరికాదని, మంత్రి పట్టించుకోవడం లేదంటూ ప్రచారం చేయడం సరికాదని ఆయన తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉంటున్నాను.. ఈ విషయం నా దృష్టికి రాలేదని మంత్రి వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, వైద్యులు డాక్టర్ జీవన్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Also Read..
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును హవాలా అడ్డాగా మార్చారు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్