మిడ్ మానేరులో నో బోటు సర్వీస్

by Sathputhe Rajesh |
మిడ్ మానేరులో నో బోటు సర్వీస్
X

సిరిసిల్ల జిల్లాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటు నిరుపయోగంగా మారింది. రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి ఎంతో హంగు ఆర్భాటాలతో ఏర్పాట్లు చేసినా అధికారుల నిర్లక్ష్యంతో నీటిపాలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుండగా 25 టీఎంసీల నీటి సామర్ధ్యంతో నిర్మించిన రాజరాజేశ్వరి జలాశయం ఇక్కడ ప్రజానీకానికి వరప్రదాయనిగా మారింది. అయితే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ లాంచీ ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, విహారానికి వెళ్లే వారి కోసం బోటు కూడా తీసుకొచ్చారు. అందుకోసం రూ.5కోట్లతో ఆధునాతనమైన లాంచీని సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటి వరకు దాన్ని ప్రారంభిచకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో రూ.కోట్ల ప్రజాధనం నీటిపాలైందని పర్యటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల జిల్లాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటు నిరుపయోగంగా మారింది. రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించిన ఎంతో హంగు ఆర్భాటాలతో ప్రారంభించినా అధికారుల నిర్లక్ష్యంతో నీటిపాలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. 25 టీఎంసీల నీటి సామర్ధ్యంతో నిర్మించిన ప్రాజెక్టు రాజరాజేశ్వరి జలాశయం ఇక్కడ ప్రజానీకానికి వరప్రదాయంగా మారింది. దీంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, విహారానికి వెళ్లే వారి కోసం బోటు కూడా తీసుకొచ్చారు.

అందుకోసం రూ.5కోట్లతో తెచ్చిన ఆధునాతనమైన లాంచీని 120మంది ప్రయాణిలకు సరిపడే విధంగా సకల సౌకర్యాలు కలిగి ఉంది. ఈ లాంచీలో చిన్న చిన్న ఫంక్షన్లు, కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చని నిర్వాహక బృందం చెబుతోంది. సిరిసిల్ల సమీపంలోని రామప్పగుడి ప్రాంతం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరం ఆహ్లాదకర వాతావరణంలో లాంచీ ప్రయాణం సాగే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసి ట్రైయల్స్ కూడా పూర్తి చేశారు. అయితే కరోనా మహమ్మారి చుట్టు ముట్టడంతో లాంచీ ప్రయాణం ప్రారంభానికి నోచుకోలేదు. కానీ కరోనా ముప్పు తొలగిపోయి రెండేళ్ల కాలం గడుస్తున్నప్పటికీ లాంచీని ప్రారంభించలేదు.

ఆరు నెలల కింద సిరిసిల్ల పట్టణంలోని కొత్తచెరువు ట్యాంక్ బండ్ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ లాంచీని ప్రారంభిస్తారని ఏర్పాటు చేసినప్పటికీ అనివార్య కారణాలతో ప్రారంభించలేదు. ఎటువంటి పర్యవేక్షణ, నిర్వహణ లేకుండా మూడున్నరేళ్లుగా ఒకే చోట ఉండడంతో సుమారు రూ.కోట్ల విలువ చేసే లాంచీతోపాటు రూ.50లక్షలు విలువైన మరో బోటు తుప్పు పట్టి నిరుపయోగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం లాంఛనీ ప్రారంభించాలనుకున్నా అది నడిచే పరిస్థితి లేదని సిబ్బంది తెలుపుతున్నారు.

పర్యాటకులకు నిరాశే..

మిడ్ మానేరులో అందమైన ప్రకృతి మధ్య విహరించాలని ఆశీస్తున్న సిరిసిల్ల పర్యాటకులకు లాంచీ ప్రారంభం జాప్యం కావడంతో నిరాశే మిగిలింది. సకల సదుపాయాలు ఉన్న లాంచీలో చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు పలువురు పర్యాటకులు ముందుకు వస్తున్నారు. కానీ లాంచీ ప్రారంభించకపోవడంతో వెనుదిరిగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కనీసం అందుబాటులో ఉన్న లాంచీని ప్రారంభించాలని పకృతి ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed