ఏడాదైనా.. నో ఏరియర్స్..! 14 వేల మంది ఉద్యోగులకు ప్రాబ్లమ్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-28 00:31:04.0  )
ఏడాదైనా.. నో ఏరియర్స్..! 14 వేల మంది ఉద్యోగులకు ప్రాబ్లమ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్‌హెచ్ఎమ్​(నేషనల్​హెల్త్​మిషన్​)లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాదైన ఏరియర్స్​ అందలేదు. జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. అప్పటి నుంచి ఉద్యోగులు అడుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడాది నుంచి ఉద్యోగులను సతాయిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం, ఆఫీసర్లు అడిగినా.. స్పందించడం లేదని ఎన్​హెచ్​ఎం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్​హెచ్​ఎం ప్రాజెక్టులో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ల్యాబ్​ టెక్నిషియన్లు, ఇతర స్టాఫ్‌లలో సుమారు 14 వేల మందికి ఏరియర్స్​ రావాల్సి ఉన్నదని ఉద్యోగులు చెబుతున్నారు.

ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టేసినట్లు వ్యవహరిస్తున్నది. ఇందుకు సంబంధించిన ఫైల్​ కూడా మూలకు పడిందని ఓ అధికారి తెలిపారు. మరోవైపు ఎన్​హెచ్​ఎం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలూ ఆలస్యమవుతున్నాయి. ప్రతి నెల ఇదే సమస్య ఉన్నదని ఉద్యోగులు చెబుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్​కు వస్తున్న బడ్జెట్‌ను ఇతర అవసరాల నిమిత్తం వినియోగించడం వలనే తమకు ఇలాంటి పరిస్థితి ఉన్నదని ఓ ఉద్యోగి చెప్పారు.

అప్రూవ్​ చేశారు? గాలికి వదిలేశారు?...

రెగ్యులర్​ ఉద్యోగులతో పాటు ఎన్​హెచ్​ఎం ఉద్యోగులకూ పీఆర్​సీ ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో గతంలో పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత ప్రభుత్వం అప్రూవల్​ చేసింది. అయితే పీఆర్​సీ ఇస్తున్నట్లు ప్రకటించారే తప్పా.. ఇప్పటి వరకు ఎన్‌ఎచ్‌ఎం‌లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగికీ ఏరియర్స్​అందలేదు. పెండింగ్​లోని ఏడు నెలల ఏరియర్స్​ను ఏడాది తర్వాత కూడా ఇవ్వకపోవడం విచిత్రంగా ఉన్నది. వందల సార్లు ఉన్నతాధికారులను ప్రశ్నించినా.. జీతాలతో కలసి ఏరియర్స్​ అందుతాయంటూనే దాట వేస్తున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికీ రాకపోవడంతో ఎన్​హెచ్​ఎం ఉద్యోగులంతా ప్రత్యేక మీటింగ్‌ను నిర్వహించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

బడ్జెట్ ​ఇక్కడ... క్లైమ్​వేరే....

కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ​ప్రాజెక్టుకు ప్రతి ఏడాది సుమారు రెండు వేల కోట్లకు పైగానే నిధులు వస్తున్నట్లు తెలిసింది. ఈ బడ్జెట్ లేకుంటే హెల్త్ సెక్టార్‌లో ఏ కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి ఉన్నది. కొత్తగా అందుబాటులోకి రాబోతున్న మెడికల్ కాలేజీల్లోని ల్యాబ్​లు, పరికరాలు, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అవసరాలను కూడా ఈ బడ్జెట్​తోనే పూర్తి చేస్తున్నారు. దీంతో తమకు సాలరీలు, బెనిఫిట్స్​, అలవెన్స్​ వంటివి అందడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. మంత్రి హరీష్​రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఏరియర్స్​ ఇప్పించాలని ఎన్​హెచ్​ఎం సిబ్బంది కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed