చెట్లే కదా అని కట్ చేయిస్తారా...ప్రకృతి ప్రేమికుల ఆగ్రహం

by Kalyani |   ( Updated:2024-10-26 14:54:32.0  )
చెట్లే కదా అని కట్ చేయిస్తారా...ప్రకృతి ప్రేమికుల ఆగ్రహం
X

దిశ, భిక్కనూరు : మొక్కే కదా అని పీకేస్తే... పీక కోస్తా అన్న ఓ సినిమాలోని డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే డైలాగ్ ను మరిపించే విధంగా,ఏపుగా పెరిగిన చెట్లే కదా అని బిజినెస్ కోసం పచ్చని చెట్లను కటింగ్ మిషన్ తో రాత్రికి రాత్రి కట్ చేయించడంతో .. వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్లను అర్ధరాత్రి, వేకువ జామున అన్న తేడా లేకుండా ఏపుగా పెరిగిన చెట్లను కట్ చేయించారు.

దీంతో అధునాతనంగా నిర్మించిన హోటల్ భవనం కనబడడంతోపాటు, బిజినెస్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇంత బరితెగిస్తారా...? అంటూ ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఆగే ప్రాంతం నుంచి సదర్ హోటల్ ఉన్న ప్రాంతం వరకు ఉన్న చెట్లను మిషన్ కటింగ్ పెట్టి తొలగించడం పట్ల మండిపడుతున్నారు. అంతటితో ఊరుకోకుండా ఈ విషయాన్ని ప్రకృతి ప్రేమికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, మాకింతవరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని రిప్లై ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాకుండా మా పరిధిలోనికి రాదని హైవే అథారిటీ అధికారుల పరిధిలోకి వస్తుందని చెబుతూ దాటవేసి ధోరణి ప్రదర్శిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులు తొలగించిన సిబ్బంది....

బిజినెస్ కోసం హోటల్ వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను, నేమ్ బోర్డులను శనివారం జీఎంఆర్ సిబ్బంది తొలగించారు. కస్టమర్లను ఆకర్షించుకునే విధంగా హైవేను ఆనుకొని ఏర్పాటుచేసిన దాబా హోటళ్ల బోర్డులు,లైటింగ్ బోర్డులను జెసిబి మిషన్ తో తీసి వేయించారు.

Advertisement

Next Story

Most Viewed