బీఆర్ఎస్ కేడర్ వలసల మర్మమేంటి..! అడ్డుకోలేకపోతున్న ఎమ్మెల్యేలు, మాజీలు

by Shiva |   ( Updated:2024-04-12 03:21:48.0  )
బీఆర్ఎస్ కేడర్ వలసల మర్మమేంటి..! అడ్డుకోలేకపోతున్న ఎమ్మెల్యేలు, మాజీలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవగా, కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి తరువాత పార్టీ అధికారానికి దూరం కావడంతో పార్టీ క్యాడర్ చేజారిపోతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిల కీలక అనుచరులు పార్టీని వీడుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలోని పలువురు ద్వితీయ శ్రేణి లీడర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు కారు దిగి చేయి పార్టీకి, పువ్వు పార్టీకి అభయహస్తం ఇస్తుండగా అడ్డుకునేవారు లేకుండా పోయారు. కనీసం పార్టీ మారుతున్న వారిని మందలించే వారు లేరని చెబుతున్నారు కార్యకర్తలు,కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఎంపీ ఎలక్షన్ లో కచ్చితంగా గెలవాలని పట్టుదలతో పార్టీ బలోపేతం చేసుకుంటున్నాయి.

దానితో బీఆర్ఎస్ పార్టీ డిలా పడుతున్నా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి ఒక్కటి రెండు కూడా స్థానిక సంస్థలు పార్టీకి మిగిలేలా కనిపించడం లేదు. వరుసగా పార్టీ లీడర్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పార్టీలు మారుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జూన్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో క్యాడర్ పార్టీ మారి పదవులపై అడ్వాన్స్ గా కర్చీఫ్ వేసుకుంటున్నారు.

బీఆర్ఎస్ వంద రోజుల వరకు ఉమ్మడి జిల్లాలో బలమైన రాజకీయ పార్టీ. మొత్తం అసెంబ్లీ స్థానాలు 9కి గాను తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ( ఓక రాజ్యసభ), ఒక ఎమ్మెల్సీ( స్థానిక సంస్థల), నిజామాబాద్ డీసీసీబీ , డీసీఎంఎస్ చైర్మన్ పదవు లతో పాటు రెండు జిల్లా పరిషత్ లు, నిజామాబాద్ మేయర్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్ మున్సిపాలిటీలతో పాటు 17మార్కెట్ కమిటీ వారి చేతిలో ఉండేది. అదంతా గతంగా మారుతుంది.అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలకు గాను రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలవడంతో పాటు అధికారం కోల్పోయింది. దానితో జిల్లాలోని బీఆర్ఎస్ క్యాడర్ ఒక్కొక్కరుగా చేజారిపోతుంది.

ఉమ్మడి జిల్లాలో తొలుత బోధన్ బల్ధియాలో తూము పద్మావతి శరత్ రెడ్డి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే షకిల్ అమెర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పాలి. తర్వాత ఆర్మూర్ బల్దియాలో స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టి గద్ధే దించి మల్లి పీఠం దక్కించుకున్న క్రమంలో కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. కామారెడ్డి లో ఇదే సీన్ రిపీట్ అయింది.అక్కడ మెజార్టీగా ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్ లు అవిశ్వాస ప్రకటించి గద్దె దించిన చోట ఇప్పుడు కాంగ్రెస్ పాగా వేయనుంది.

ఇటీవల నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాసం గద్దె దించడం చక చకా జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా డీసీఎంఎస్ చైర్మన్ సొంత సోసైటి నల్లవెల్లిలో అవిశ్వాస గండం తప్పేలా లేదు. గత నెలలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మారీ బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇటీవల నిజామాబాద్ మాజీ మేయర్, కొంత మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో మరి కొందరు బీజేపీలో చేరారు.బీంగల్ తొలి మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు ,కొందరు జెడ్పీటీసీలు పార్టీ మారి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి షాకిచ్చారు. బాన్సువాడ లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారి పెద్ధ షాక్ ను ఇచ్చారు.

పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలపై బీఆర్ఎస్ గురిపెట్టి పోటీ చేస్తుంది. సెగ్మెంట్ లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల వారీగా బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ప్రకటన వరకు సందిగ్ధత ఉండగా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా వారిరువురు జోరుగా ప్రచారం చేస్తున్నారు.కానీ క్యాడర్ చేజారకుండా ఆపలేకపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వలసలను నిరోధిం చకుండా చేతులేత్తేశారు.మరో 5 సంవత్సరాలు అధికారం దూరంగా ఉండటం ఖాయం కాగా, కొన్ని రోజులలో స్థానిక సంస్థలు,నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు విస్తరణ నేపథ్యంలో క్యాడర్ లో ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీలు మారుతున్నారు.

అయితే జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మారడం వెనుక తాజా మాజీల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి పదవి కోల్పోవడానికి తగినంత సంఖ్య బలం ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లో కోవర్ట్ గా పని చేశారని పార్టీ సీనియర్ నేత నిట్టు వేణుగోపాల్ రావు బహిరంగంగా చెబుతున్నారు. తాజాగా నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాసం, చైర్మన్ పధవిచ్యచుతుడు కావడం వెనుక కోవర్డు రాజకీయాలు ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, పార్టీ అధినేత ఫిర్యాదు వరకు వెళ్లడం విశేషం. మరి కొన్ని చోట్ల మాజీ స్థానిక సంస్థల , ప్రజాప్రతినిధులు పార్టీ మార్పు వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వారు ముందుగా పార్టీ క్యాడర్ ను పంపించి అదే దారిలో పార్టీ మారుతారని ప్రచారం జరగుతుంది. ఈ విషయం పార్లమెంట్ ఎన్నికల తరువాత ఎంత మంది మాజీలు ఉంటారు లేదా తమ భవిష్యత్తు పెరిట ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారనేది తెలిపోనుంది.

Advertisement

Next Story