ఓటర్లకు పోలింగ్‌ బూత్‌లలో సదుపాయాలు కల్పించాలి

by Sridhar Babu |   ( Updated:2023-10-10 12:55:26.0  )
ఓటర్లకు పోలింగ్‌ బూత్‌లలో సదుపాయాలు కల్పించాలి
X

దిశ,నిజాంసాగర్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు అన్ని వసతులు కల్పించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి సూచించారు. ఈ సందర్బంగా ఆయన పోలింగ్‌ బూత్‌లలో ఓటర్ల కు కావాల్సిన విద్యుత్​, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల వసతుల గురించి సెక్టోరియల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రాలలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సత్వరమే పరిష్కరించుకోవాలని,

నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎలాంటి ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయించకుండా చూడాలన్నారు. అదేవిధంగా 80 సంవత్సరాల పైబడిన వారితో పాటు వృద్దులు, వికలాంగులు, ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ గురించి అవగాహన కల్పించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని సెక్టోరియల్‌ అధికారులు, తహసీల్దార్లు భిక్షపతి, రామ్మోహన్, రేణుక చౌహన్, మహమ్మద్ ముజీబ్, గంగాసాగర్, విజయ్ కుమార్, ఎంపీడీఓలు నాగేశ్వర్, ఎంఈఓలు, దేవ్ సింగ్, ఇరిగేషన్,వ్యవసాయ అధికారులు అమర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed