MBI Vivekananda Reddy : వాహనాలకు తప్పకుండా ఇన్సూరెన్స్ లను చేయించుకోవాలి..

by Sumithra |
MBI Vivekananda Reddy : వాహనాలకు తప్పకుండా ఇన్సూరెన్స్ లను చేయించుకోవాలి..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ ప్రాంతంలోని వాహనదారులందరూ వారి వారి వాహనాలకు ఇన్సూరెన్స్ లను తప్పకుండా చేయించుకోవాలని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ లోని ఎం.జె ఆస్పత్రి పక్కనగల ఎంబీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల మూడో తేదీన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకోవడం తప్పనిసరి అయింది అన్నారు. ప్రజలు వారి వారి వాహనాల ద్వారా ఇతరులకు గాయాలు తగిలితే ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయన్నారు. పర్సనల్ ఇన్సూరెన్స్ అనేది ఒక వెయ్యి రూపాయల నుండి 1500 వరకు కట్టినట్లయితే 15 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ అవుతుందని ఎంవీఐ అన్నారు.

వాహనాల తనిఖీల్లో భాగంగా ఇన్సూరెన్స్ లేనట్లయితే తొలిసారి ఒక నెల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా, రెండోసారి ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే వాహనదారులకు మూడు నెలల జైలు శిక్షతో పాటు, 4000 రూపాయల జరిమానా ఉంటుందన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు త్వరలోనే ముమ్మరం చేస్తామని వాహనదారులు వారి వారి వెంట తప్పకుండా వాహన పత్రాలను, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్లను తప్పకుండా ఉంచుకోవాలన్నారు. తనిఖీల్లో ఇవి లేకుండా పట్టుబడితే వాహనదారుల పై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed