- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పగలు బెడ్ షీట్ల అమ్మకాలు.. రాత్రి వేళ చోరీలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో పట్టపగలు మ్యాట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ రాత్రిళ్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ కె ఆర్ నాగరాజు తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు పగలు బెడ్ షీట్లు, మ్యాట్లు అమ్ముతూ.. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతుండే వారన్నారు.
నగరంలోని అశోక్ వీధికి చెందిన ప్రసాద్ జోషి అనే పురోహితుడు ఇంట్లో ఆగస్టు మాసంలో రాజస్థాన్ కు చెందిన మహేంద్ర అలియాస్ నాయక్, అమర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారని సీపీ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఇంచార్జి నగర సిఐ విజయ్ బాబు, రెండవ టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో రాజస్థాన్ కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల 75 వేల సొత్తును రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. కేసును చేదించిన అధికారులను ఏసీపీ అభినందించారు.