- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్..

దిశ, ఆర్మూర్ : ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ప్రభాకర్ రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ గ్రామ శివారులో శనివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉండగా ఆల్టో కారును అనుమానం వచ్చి తనిఖీ చేశారు.
కాగా అందులో ఇద్దరు వ్యక్తులు పారిపోయారని, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని విచారణ చేపట్టగా, వారు ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసి అందులోని కాపర్ అమ్ముకుంటున్నట్లు తెలిసిందన్నారు. అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 60 కిలోల కాపరు వైరు, 78,000 నగదును స్వాధీన చేరుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులు బార్ల పోశెట్టి, ఉప్పు సుధాకర్ లపై గతంలోనూ పాత కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ సురేష్ బాబు, ఎస్సైలు రాము, శివరాం నాయక్, ఏఎస్ఐ గఫర్, సిబ్బందిని ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.