- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ
దిశ, ఇందల్వాయి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇందల్వాయి మండల కేంద్రంలో ఎంపీపీ రమేష్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గంగాదాస్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మోడీకి హటావో దేశానికి బచావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఎందరో ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్ర ప్రజల పట్ల బీజేపీ విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ప్రధాని హోదాలో ఉండి రాష్ట్రాల పట్ల అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్లో తెలంగాణకు నయాపైసా కేటాయించలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బిరీష్, సీనియర్ నాయకులు పాశం కుమార్, శ్రీనివాస్, చింతల దాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.